కోట్యా తండా సర్పంచిని సన్మానించిన అధికారులు

నవతెలంగాణ – తిరుమలగిరి
తిరుమల మండలం కొట్యా తండా గ్రామపంచాయతీ సర్పంచ్ దరావత్ హైమావతి రామోజీని గురువారం తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హైమావతి రామోజీ మాట్లాడుతూ తాను గత ఐదు సంవత్సరాలుగా నూతనంగా ఏర్పడ్డ కోట్యా తండాకు సర్పంచ్ గా  గెలిచిన తన కాలంలో గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశానని అన్నారు. ప్రభుత్వ నుండి నూతనంగా ఏర్పడ్డ గ్రామపంచాయతీలకు అరకొర నిధులను మంజూరు చేసినప్పటికీ తాను సమన్వయంతో అధికారుల సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. తనకు  పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసమే పని చేస్తానని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని తనను నమ్ముకొని తనను గెలిపించి ఐదు సంవత్సరాల తనకు సహకరించిన ప్రజలే తనకు ముఖ్యమని అన్నారు. తన పదవి కాలంలో  సర్పంచ్ గా అభివృద్ధికి సహకరించిన అధికారుల తో పాటు గ్రామ కార్యదర్శికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమరుగోముల స్నేహలత, జడ్పిటిసి దూపటి అంజలి రవీందర్, ఎంపీడీవో  ఉమేష్ చారి, ఎంపిటిసి ధరావత్ జమ్మిలాల్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.