బిబిపేట మండలంలోని శేరిబిపేట్, శివరాం రెడ్డి పల్లి, కోనాపూర్ గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించరు. ఈ సభలలో ప్రజల నుండి పలు దరఖాస్తులను స్వీకరించారు. రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు నాలుగు పథకాలు కొరకు గ్రామ సభలు నిర్వహించడం జరిగిందనీ మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ తెలిపారు. ఈ గ్రామ సభల్లో ఆమోదం పొందిన అర్హులైన వారందరి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో బంతి పూర్ణ చంద్రోదయ కుమార్, ఎంపీఒ అబ్బా గౌడ్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నరేందర్, అధికారులు ఎం అనిల్, డి వెంకట్ స్వామి, సిహెచ్ భరత్, వీరితోపాటు గ్రామస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడి టీచర్లు, వివో ఏలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.