మోపాల్ మండల్ నూతన ఎంపీ ఒగా కిరణ్

నవతెలంగాణ-మోపాల్ : పంచాయతీరాజ్ బదిలీల్లో భాగంగా మోపాల్ మండలం నూతన ఎంపీ ఓగా కిరణ్, మంగళవారం రోజున బాధ్యతల చేపట్టడం జరిగింది. కిరణ్ నందిపేట్ నుండి బదిలీపై ఇక్కడికి రావడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ఇక్కడ పనిచేసిన ఇక్బాల్ నిజామాబాద్ కి బదిలీపై వెళ్లడం జరిగింది. నూతన ఎంపీ ఓను మరియు బదిలీ అయినా ఇక్బాల్ ని పంచాయతీ సెక్రెటరీలు మరియు ఎంపీడీవో లింగం నాయక్ సూపర్డెంట్ ప్రదీప్ కుమార్ తదితరులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు ధీరజ్, మృదుల, హరీష్ మల్లేష్, ఆర్మీ రాజు, నవీన్, సాయి ,చైతన్య ,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.