ఓహ్.. టీజర్‌ రిలీజ్‌

ఓహ్.. టీజర్‌ రిలీజ్‌జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్‌ పతాకంపై రఘు రామ్‌ హీరోగా, శతి శెట్టి, నైనా పాఠక్‌ హీరోయిన్స్‌గా సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓహ్!’.
కులుమనాలి, ఆగ్రా, గోవా, హైదరాబాద్‌, వరంగల్‌లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్‌ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా చిత్ర టీజర్‌ ఆవిష్కరణ వేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన గేయ రచయిత భాష్య శ్రీ టీజర్‌ను లాంచ్‌ చేశారు. చిత్ర సమర్పకురాలు బిఆర్‌ఆర్‌ గ్ూప్స్‌ అధినేత్రి జీవిత బడుగు మాట్లాడుతూ, ‘మంచి క్వాలిటీతో ఈ సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నాం’ అని అన్నారు.
‘ఐదు చిత్రాలను నిర్మించిన అనుభవంతో ఒక కొత్త జోనర్‌లో, క్రోమో ఫోబియాని పాయింట్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని దర్శక, నిర్మాత సత్యనారాయణ ఏకారి చెప్పారు.