విష్ణు మంచు భారీ స్థాయిలో నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం మోహన్ బాబు 50 ఏళ్ల నట ప్రస్థానంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన లుక్‌ని రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో మహాదేవ శాస్త్రిగా గంభీరమైన లుక్‌తో ఉన్న మోహన్‌బాబు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ మూవీపై అంచనాలు పెంచగా, తాజాగా రిలీజైన మోహన్ బాబు పోస్టర్ మరింత బజ్ క్రియేట్ చేసింది. సినిమాలో ఈ క్యారెక్టర్ ఏ రేంజ్‌లో ఉండనుందా? అనే క్యూరియాసిటీ నెలకొల్పింది. కన్నప్ప ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుందని, భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించబోతున్నామని మేకర్స్ చెప్పారు. ఈ సినిమాతో మోహన్ బాబు మనవడు, మంచు విష్ణు తనయుడు అవ్రామ్ సినీ రంగ ప్రవేశం చేస్తుండటం విశేషం. ఓ వైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. మోహన్ బాబు నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా టాలీవుడ్‌లో ఓ మైలురాయి అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది.
‘ఈ సినిమాలో ‘కన్నప్ప’గా మంచు విష్ణు నటిస్తున్నాడు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షరుకుమార్, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్ భిన్న పాత్రలు పోషిస్తున్నారు. వీరి పాత్రలు, వాటి తీరు తెన్నులు ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. మేం ఏ లక్ష్యంతో అయితే వీరిని ఈ సినిమా కోసం తీసుకున్నామో, అది ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేందుకు వీరి పాత్రలు బాగా దోహదం చేస్తాయి. మహాభక్తుడు ‘కన్నప్ప’ గురించి నేటి తరానికి బాగా అర్థమయ్యేలా, అత్యంత రసవత్తరంగా ఆద్యంతం ఉండేలా దర్శకుడు ముకేష్ కుమార్‌సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేను మహాదేవ శాస్త్రిగా ఓ కీలక పాత్రలో ప్రేక్షకులకు కనిపించ నున్నాను. నా పాత్ర అందర్నీ అలరిస్తుంది’.
– మోహన్‌బాబు