ఆయిల్ ఫామ్ పంట సాగు ఉపయోగకరం

నవతెలంగాణ – బెజ్జంకి
వరి పంటకు బదులుగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేయడం ఉపయోగకరమని ఏఓ సంతోష్ సూచించారు. శనివారం మండల పరిధిలోని చీలాపూర్ గ్రామంలో ఆయిల్ ఫెడ్ క్షేత్ర సహయకులు రాములు రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగుపై అవగాహన కల్పించారు.ఈ ఏడాది సుమారు వెయ్యి ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగుకు ప్రణాళిక రుపోందించామని రైతులు ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఏఓ సూచించారు.సర్పంచ్ రాగుల మొండయ్య,ఏఈఓ శ్వేత ,రైతులు పాల్గొన్నారు.