నవతెలంగాణ – అశ్వారావుపేట
జూన్ నెలకు చెల్లించాల్సిన ఆయిల్ ఫాం గెలలు ధరను ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు శుక్రవారం ప్రకటించారు.ప్రతీ నెల 1 వ తేదీనే బహిర్గతం చేసే అధికారులు ఈ నెల మాత్రం 5 రోజులు ఆలస్యంగా ధర ను ప్రకటించారు. జూన్ నెల కు చెల్లించాల్సిన టన్ను గెలలు ధర రూ.13,705 లు నిర్ణయించినట్లు ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి తెలిపారు. అయితే మే నెల కంటే జూన్ నెలలో టన్ను కు రూ.261 లు తో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపిస్తుంది.
ఈ ఏడాది గడిచిన 6 నెల ల్లో టన్ను గెలలు కు జనవరి లో రూ.12,681 లు,ఫిబ్రవరి లో రూ.13,135 లు,మే లో రూ.13,438 లు,జూన్ లో రూ. 13,705 లు,మార్చి లో రూ.14,174 లు,ఏప్రియల్ లో రూ.14,229 లు గా ధరలు ఉన్నాయి.
నెల ధర హెచ్చుతగ్గులు
జనవరి 12,681
ఫిబ్రవరి 13,135 + 454
మార్చి 14,174 + 1,039
ఏప్రియల్ 14,229 – 55
మే 13,438 – 791
జూన్ 13,705 + 261
వాతావరణంలో వచ్చిన మార్పులకు ఈ ఏడాది గెలల దిగుబడి సైతం తగ్గుముఖం పట్టింది. దీనికి తోడుగా గెలల ధర సైతం అంతంత మాత్రమే ఉండటంతో రైతులు నిరాశకు గురి అవుతున్నారు.