
పోడు పట్టా పొందిన గిరిజన రైతులకు ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ఫెడ్ రాయితీ పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం పోడు పట్టాలు పొందిన రైతులు ‘రైతుబంధు’ ఐడీతో దరఖాస్తు చేసుకుంటే సబ్సిడీపై పామాయిల్ మొక్కలతో పాటు డ్రిప్, 4 ఏళ్ళ నిర్వాహణ ఖర్చులు మంజూరు చేస్తామని వివరించారు. పోడు పట్టా పొందిన భూములకూ రాయితీ పధకాలు అమలు చేయాలని ఆయిల్ఫైడ్ నిర్ణయించినట్లు చెప్పారు.దరఖాస్తు చేసుకునే పోడు పట్టాదారు నీటి వసతి ఉన్నట్లు ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని పోడు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆయన వెంట ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ నాయుడు రాధాక్రిష్ణ ఉన్నారు.