కస్టమర్లకు ‘ఓలా’ మేనేజర్‌ కుచ్చుటోపి

'Ola' manager Kuchutopi to customers– ఎలక్ట్రికల్‌ బైకు కోసం చెల్లించిన
– అడ్వాన్స్‌ డబ్బులు సొంత జేబులోకి
– శంషాబాద్‌ ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌
– షోరూం వద్ద కస్టమర్ల ఆందోళన
– ‘ఓలా’ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్‌
నవతెలంగాణ-శంషాబాద్‌
ఎలక్ట్రిక్‌ బైకుల కొనుగోలు కోసం అడ్వాన్స్‌ చెల్లించిన కస్టమర్స్‌కు శంషాబాద్‌ ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూం మేనే జర్‌ కుచ్చుటోపి పెట్టారు. దీంతో కస్టమర్లు షోరూం వద్ద ఆందోళనకు దిగిన ఘటన శంషాబాద్‌ ఓలా బైక్‌ షో రూం వద్ద బుధవారం జరిగింది. కట్టిన డబ్బులకు యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ల కోసం మేనేజర్‌ వర్మను సంప్రదించామని తెలిపారు. బైకు కొనుగోలులో భాగంగా కొంత ముందస్తు రుసుము చెల్లించారని తెలిపారు. నిర్ణీత కాలపరిమితి ముగిసిన తరువాత బైకు కోసం ఓలా షో రూంకు వచ్చి అడిగితే మేనేజర్‌ లేడని అక్కడున్న సిబ్బంది తెలపడంతో చాలాసార్లు వెనిదిరిగిపోయారు. ఆయన నెంబర్‌ తీసుకొని ఫోన్‌ చేస్తే ఎలాంటి స్పందన లేదు. అనుమానం వచ్చి విషయాన్ని ఆరా తీస్తే తాము కట్టిన డబ్బులు మేనేజర్‌ తన సొంత ఖాతాలోకి మళ్లించుకు న్నట్లు తెలిసింది. దీంతో అడ్వాన్స్‌ చెల్లించిన వారందరూ ఓలా ఎలక్ట్రికల్‌ బైక్‌ షోరూం వద్ద ఆందోళనకు దిగారు. బైకులు కావాలని అడిగితే యాజమాన్యం బదులిస్తూ కస్ట మర్లు చెల్లించిన డబ్బులు కంపెనీ అకౌంట్‌లోకి రాలేదని సెలవిచ్చారు. మేనేజర్‌ వర్మ వారం రోజుల నుంచి షో రూమ్‌లో విధులకు హాజరు కావడం లేదన్నారు. డబ్బులు చెల్లించి వాహనాలు తీసుకుపోవాలని షోరూం నిర్వాహ కులు తెలపడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేశారు. తమకు మేనేజర్‌ వర్మకు డబ్బులు కట్టిన రసీదులను చూ పిస్తూ బైకులు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. కస్టమ ర్లను ఓలా యాజమాన్యం అందులో పనిచేస్తున్న మేనేజర్‌ సిబ్బంది మోసం చేశారని తెలిపారు. ఈ విషయంపై స మగ్ర విచారణ జరిపి ఓలా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కస్టమర్లు డబ్బులు చెల్లిస్తున్న విషయంపై ఓలా యాజమాన్యం ఎందుకు ని ఘా పెట్టలేదని ఆయనను ఎందుకు వదిలేసారని ఎంతో పేరున్న ఇలాంటి సంస్థలు అందులో పని చేసే వ్యక్తుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం దేనికి సం కేతం అని ప్రశ్నించారు. మేనేజర్‌ వర్మ నుంచి డబ్బులు యాజమాన్యం తీసుకుంటుందా లేదా అనేది తమకు సంబంధం లేదని తాము ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూం లో డబ్బులు చెల్లించామని మేనేజర్‌ ఇంటికి వెళ్లి చెల్లించ లేదన్నారు. మేనేజర్‌ అవినీతి, చీటింగ్‌ చేసినందుకు యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం మేనేజర్‌ విషయంలో తమకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పడం సరికాదన్నారు. యాజమాన్యం స్పందించి వెంటనే బాధితులకు న్యాయం చేయాలని కస్ట మర్లు ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూం నుంచి నేరుగా ఆర్జెఐఏ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై చర్యలు తీసుకో వాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.