ఓలా ఎస్‌1 స్కూటర్‌ ఉత్పత్తి నిలిపివేత

బెంగళూరు : ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ తన ఎస్‌1 స్కూటర్‌ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. 2021లో విడుదల చేసిన ఈ మోడల్‌ను తాజాగా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఈ నిర్ణయానికి కారణంపై స్పష్టతనివ్వలేదు. దీంతో ఇకపై ఎస్‌1 ఎయిర్‌, ఎస్‌1 ప్రో మోడల్స్‌ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.