వృద్ధాప్య దశ సృష్టిధర్మంలో భాగమే..

– మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్ 
– బాల వికాస అధ్వర్యంలో అనాధ వృద్ధుల ఆదరణ పండుగ 
నవతెలంగాణ- బెజ్జంకి 
పుట్టిన దశ నుండి యుక్త దశ..తదుపరి వృద్ధాప్య దశకు చేరడం సృష్టిధర్మంలో భాగమేనని..వృద్ధులకు చేయూతనందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని మాజీ ఎంపీపీ,రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలోని కృపా భవనం యందు బాలవికాస స్వచ్ఛంద సేవ సంస్థ అధ్వర్యంలో అనాధ వృద్ధుల ఆదరణ పండుగను ఘనంగా నిర్వహించారు. పలువురు దాతల సహకారంతో బెజ్జంకి, ఇల్లంతకుంట, తిమ్మాపూర్, కోహెడ, చిన్నకోడూర్ మండలాలకు చెందిన సుమారు 40 మంది వృద్ధులకు నూతన దుస్తులు, నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యం చోప్పున ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథులుగా హాజరైన ఒగ్గు దామోదర్,చర్చి ఫాదర్ ప్రశాంత్, విలాసాగరం సత్యం, సతీష్ పంపిణీ చేశారు. బాలవికాస ప్రతినిధులు పాల్గొన్నారు.