– ప్రజలిచ్చిన తీర్పును అర్థం చేసుకోలేనీ బీఆర్‌ఎస్
– ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే కాంగ్రెస్ నైజం
– షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-కేశంపేట
ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అర్థం చేసుకోలేని బీఆర్‌ఎస్ నేతలు, నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రజలతో మమేకమై మిమ్మల్ని పాతాళానికి పాతరేస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘాటుగా విమర్శించారు. శుక్రవారం కేశపేట మండలం కేంద్రంతో పాటు సంగెం, కొత్తపేట గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంబురాలు అంబరానంటాయి. రైతు రుణమాఫీ సంబురాలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై, రైతులు, మహిళలు, ప్రజలతో కలిసిన ఆనందంలో ఆటాపాటలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనితీరు కండ్లకు కట్టినట్టు కనబడుతున్న ఆరు గ్యారెంటీలు ఎక్కడ అని ప్రశ్నించే వారు కండ్లులేని కబోదులా అని ప్రశ్నించారు. ఏకకాలంలో అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేసి దేశంలోనే ఒక చరిత్ర నెలకొల్పిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతోందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. ఎన్నికల సమయంలో కపట ప్రేమ మనసులో పెట్టుకుని కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి చాలామందిని నిరుత్సాహపరిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలికెక్కడ అని విమర్శించారు. ప్రజల వద్దకు రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా వస్తుంటాయి, పోతుటాయనీ, కానీ ప్రజలకు మంచి చేసిన సేవకుడెవరో ప్రజలే గ్రహిస్తున్నారని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాయిదాల పద్ధతిన చేసిన రుణమాఫీ కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడానికే తప్ప, వడ్డీల కిందికే రుణమాఫీ సరిపోయి రైతులను నట్టేట ముంచిందన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తున్న పాలమూరు రైతుబిడ్డ రేవంత్ రెడ్డికే ప్రజల మద్దుతు ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూడ వీరేశం, యూత్ అధ్యక్షులు భాస్కర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాలా శ్రావణ్ కుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ యాదయ్య యాదవ్, నాయకులు శ్రీధర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శివ శంకర్‌గౌడ్, రమేష్, రాజేందర్ రెడ్డి, పెంటయ్య పర్వతాలు, రాములు, మల్లయ్య, సురేష్ భీమయ్య, అనసూయమ్మ, గోపాల్, అనంత రెడ్డి, ఇబ్రహీం, నర్సీంలు, పెంటయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.