ఏటీఎం చోరికి పాల్పడిన పాత నేరస్తుడి అరెస్ట్

– ముడు కేసుల్లో రూ.30 వేల నగదు సీజ్
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఏటీఎం సెంటర్లో అమాయక ప్రజలను మోసం చేసి, వారి ఏటీఎం మార్చి తర్వతా డబ్బులను డ్రాచేసుకొని మోసం చేస్తున్నా గద్దమిది రమేష్ @ రాజు కామారెడ్డి జిల్లా, భిక్కనుర్ మండలం, జంగం పల్లి గ్రామం ఇటీవల నగరంలోని వన్ టౌన్ పరిధిలోని మూడు ఏటీఎం లను మార్చి చోరికి పాల్పడినట్లు వెల్లడించారు. ఇలా ఏటీఎంలో నమ్మించి చోరీకి పాల్పడిన పాత నేరస్థుడిని అరెస్టు చేసి మూడు కేసుల్లో 30000 నగదు సీజ్ చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు మంగళవారం ప్రకటనలో తెలిపారు.