చీకట్లో తప్పిపోయిన చందమామలా,
బురఖాలో ఆమె ముఖాన్ని చూశాను.
మెరిసే తల్వార్ పదును చూసినట్టు,
వేలితో ఆమె నవ్వును తాకాలనిపించింది.
తుఫాను ఎడారిలో సుడిగాలి అయినట్టు,
ఆమె అడుగులు రేపుతూ,
నా కళ్ళలో నడిచి పోయింది.
ఈ దారిన ఎవరు వెళ్ళారో,
గాలిలో మిగిలిన అత్తర్ వాసన తెలుపుతుంది.
కన్నీళ్లతో కలిసి ఆవిరయ్యిందా,
లిప్‌స్టిక్ రంగులో ఎండిపోయిందా,
పగటిపూట పగిలిన గాజులాంటి
ఎండా వేడీ తెలుపుతుంది. –
రాత్రి అద్దం మీది దుమ్ము లాంటి
చినిగిన వెన్నెల, పాత పరదాలా ఊగుతుంది.
నీ కళ్ళ రంగు నాకు ఇష్టం,
అది ఎరుపుగా వుండదు –
నీలం వజ్రంలా వుంటుంది.
సముద్రంలో దూకడం నాకు ఇష్టం,
నాది స్వేచ్ఛ కోరుకొనే స్వప్నం.
నీ కళ్ళు ఎప్పుడూ కన్నీళ్ళు రాల్చొద్దు,
అవి ఖంజర్ల మొనలు,
కఠినాత్ముల గుండెల్లో దిగాలి.
నాకు తెలుసు, ఇది ఎడారి.
తారల బారాత్‌లో నడవలేను
సంకెళ్ళు ఏవైనా మోయలేను
ఫైజ్ అహమద్ ఫైజ్ నూ మరవలేను.
– ఆశారాజు, 9392302245