పాత బకాయిలు వెంటనే చెల్లించాలి: చక్రపాణి

నవతెలంగాణ – భీంగల్
మధ్యాహ్న భోజన కార్మికుల పాత బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ వర్కర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి ఆధ్వర్యంలో మండల విద్యాధికారి  స్వామి కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకుల ద్వారా  విద్యార్థులకు అందిస్తున్న  కోడిగుడ్డు చార్జీలను ప్రభుత్వం గత ఐదు ఆరు నెలల నుండి చెల్లించడం లేదని పైగా ప్రస్తుతం   పాఠశాలలో పున ప్రారంభం కావడంతో విద్యార్థుల కోడిగుడ్లు అందించాలని  నిర్వాహకులపై నెట్టి వేయడం సమంజసం కాదన్నారు. పాత బకాయిలు చెల్లించకుండానే మళ్లీ  గుడ్లు అందించాలని ఒత్తిడి చేయడం మానుకోవాలన్నారు. వినతి పత్రం అందించిన వారిలో మండల మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు.