చెరువులో పడి వృద్ధురాలి మృతి

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని  న్యాల్కల్ గ్రామానికి చెందిన పోసాని వయసు(58) సంవత్సరాలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం పోసాని మరియు ఆమె భర్త పెద్ద సాయిలు వ్యవసాయ భూమి సాగు చేసేవారు ఇద్దరి మధ్య డబ్బులు విషయంలో గొడవపడి ఆమె మనస్థాపం చెంది నాల్కల్ గ్రామంలోని మాసాని చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. కూతురు పల్లికొండ స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు.