అనారోగ్యంతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన దండ బోయిన నర్సయ్య (78) గత ఐదు సంవత్సరాల నుండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ, మూడు సంవత్సరాల క్రితం కుమారుడు, కోడలు మృతి చెందడం, పని చేయలేని పరిస్థితిలో ఉండటం వంటి సమస్యలతో, మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.