కళ్లను దానం చేసిన వృద్దుడు

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని తిరుమలకుంట  కు చెందిన బసవ రాజుల భూషణం (60) బుధవారం రాత్రి  వయోభారంతో మృతి చెందాడు.తన తండ్రి నేత్రాలను దానం చేద్దామనే మంచి తలంపుతో కుమారుడు బసవరాజు సత్యనారాయణ నేత్రదానం కొరకు పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్రరావు(రాము) సహాయం కోరాడు.దీంతో పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామ చంద్రరావు,డాక్టర్ హరిప్రసాద్ లు గురువారం తిరుమలకుంట చేరుకొని మృతదేహం నుండి నేత్రాలను సేకరించారు.అనంతరం ఖమ్మం నేత్రాలయకు  తరలించారు.తన తండ్రి నేత్రాలు ద్వారా మరొకరికి చూపునివ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన ఆ కుటుంబ సభ్యులకు అధ్యక్షులు డేగల రాము కృతజ్ఞతలు తెలియజేశారు.భూషణం రెండు కళ్ళు మరో ఇరువురికి కంటి వెలుగును అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మురళి, బసవ రాజుల రాము,పల్లెల రామ లక్ష్మయ్య, బొడ్డు సత్తిబాబు, కందుకూరు శ్రీను, ములగాల నరసింహ రావు, బసవ రాజుల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.