నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారినులను శనివారం ఒలింపిక్ అధ్యక్షులు ఈగ సంజీవ రెడ్డి స్వగృహంలో అభినందించరు. ఒక్కే కుటుంబనికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు ఫుట్ బాల్ క్రీడలో రానిస్తూ తెలంగాణ జట్టు కు అడరు. ఇద్దరు కవల పిల్లలు కాగా, ఇంకో అమ్మాయి వీరి కంటే చిన్నది. ఇద్దరు ఏంఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరాము చదువుతున్నారు. ఒక్క అమ్మాయి ఎస్అర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరము చదువుతోంది. చదువులో, ఆటల్లో రానిస్తున్నారు. ఈ సందర్బంగా ఒలింపిక్ అధ్యక్షులు మాట్లాడుతూ.. ఫుట్ బాల్ కోచ్ అయిన నాగరాజ్ తో మాట్లాడి వీరికి మంచి శిక్షణ ఇవ్వాలని, వీరికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు. అలాగే మంచిగా చదువుకోవాలని సూచించారు. ఒలింపిక్ అధ్యక్షులు క్రీడాకారినులకు అండగా ఉండడం క్రీడాకారినుల కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు.