11న గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను జయప్రదం చేయండి..

On 11th Gorrepati Madhavrao memorial meeting.– మానవ హక్కుల వేదిక జిల్లా ప్రతినిధి జి శ్రీనివాస్ పిలుపు
నవతెలంగాణ – బోధన్ టౌన్ 

మానవ హక్కుల వేదిక పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ న్యాయవాది , పీడిత ప్రజల పక్షపాతి, JCS ప్రసాద్ లైబ్రరీ మేనేజింగ్ ట్రస్ట్ గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను జనవరి 11న శనివారం రోజున నిజామాబాద్ కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట వారి స్వగృహం నందు ఏర్పాటు చేయడం జరిగిందని , ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మానవ హక్కుల వేదిక జిల్లా ప్రతినిధులు జి.శ్రీనివాస్ గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జి శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో హక్కుల కోసం నిరంతరం కృషి చేశాడని విద్యార్థి దశ నుండి ప్రగతిశీల ఆలోచనలు కలిగి పేద ప్రజల పక్షపాతిగా నిరంతరం కొనసాగారని గుర్తు చేశారు ,అనేక పోలీసు తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేసి గెలిచి దేశంలోనే పేరుగాంచారని కొనియాడారు , జిల్లాలో సీనియర్ న్యాయవాదిగా ఉంటూ ఉద్యమ కేసులపై కొట్లాడి ఉద్యమకారులకు అండగా నిలిచారని తెలిపారు, తెలుగు ఇంగ్లీషు హిందీ భాషల పై పట్టు కలిగిన వ్యక్తి అని , అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించాడని ముఖ్యంగా కార్మిక చట్టాలు మరియు నిత్యజీవితంలో గతి తార్కికము లాంటి పుస్తకాలు రచించిన విప్లవ మేధావి అలాంటివారు డిసెంబర్ 28న మరణించారని ఆయన మరణం హక్కుల కార్యకర్తలకు ప్రగతిశీల శక్తులకు ముఖ్యంగా న్యాయవాదులకు తీరని లోటు అని అన్నారు . ఆయన స్ఫూర్తితో హక్కుల రక్షణకై ఉద్యమిద్దమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గడ్డం గంగులు పిడిఎస్సి జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ , జిల్లా నాయకులు సాయినాథ్ , నాయకులు ప్రకాష్ , రవి , రాజు , ప్రతాప్ , సుధాకర్ , స్వప్న , శ్రీలత , జమున , ప్రణవి , కీర్తన తదితరులు పాల్గొన్నారు.