12న డీఎస్పీ జిల్లా ఆవిర్భావ సభ..

– విజయవంతం చేయాలని లింగాల సురేశ్ పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి
ఈ నెల 12న జిల్లా కేంద్రంలోని భూదేవి గార్డెన్ యందు నిర్వహిస్తున్న డీఎస్పీ ప్రథమ ఆవిర్భావ సభకు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల ప్రజలు,మేథావులు పెద్ద సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని డీఎస్పీ మండలాధ్యక్షుడు లింగాల సురేశ్ బుధవారం పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభకు డీఎస్పీ వ్యవస్థాపకులు విశారధన్ మహారాజ్ ముఖ్య అతిథిగా హజరవుతున్న దృష్ట్యా ప్రజలు హజరవ్వాలని సురేశ్ విజ్ఞప్తి చేశారు.