14న వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

– సీఎం చేతుల మీదుగా నిమ్స్‌కు శంకుస్థాపన :మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల14 న వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ శాఖ మంత్రి హరీశ్‌ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ మార్గ నిర్దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయనీ, దేశంలోనే తెలంగాణ అగ్రస్థానాని కి ఎదిగిందని మంత్రి అన్నారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.