18న దుబ్బాకలో ఎమ్మార్పీఎస్ భారీ ర్యాలీ..

MMRPS huge rally in Dubbaka on 18..నవతెలంగాణ – దుబ్బాక
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 18న దుబ్బాక మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘లక్ష డప్పులు -వేల గొంతుల’ భారీ ర్యాలీ కార్యక్రమం దుబ్బాక లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం నుండి జగ్జీవన్ రామ్ విగ్రహ చౌరస్తా వరకు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు స్వామి తెలిపారు.గురువారం దుబ్బాకలో వారు మాట్లాడారు.మండలంలోని మాదిగ,మాదిగ ఉపకులాల ప్రజలు ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.మండల ఉపాధ్యక్షులు బెల్లె రమేష్,దుబ్బాక బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులు సీహెచ్.రాజమల్లు,ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ నాయకులు ఇస్తారిగల్ల యాదగిరి,చెక్కపల్లి రాజేందర్,సారంపల్లి దుబ్బయ్య పలువురున్నారు.