జూలై 21 న ప్రజాకవి డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య 99వ జయంతి సభను జయప్రదం చేయాలని జయంతి నిర్మాణ కమిటీ కన్వీనర్ సిర్ప లింగయ్య కోరారు. నిజాంబాద్ నగరంలో టిఎన్జివో భవన్లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిజాంబాద్ నగరంలో (దుబ్బ) ఇందూరు యువత ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యఅతిథిగా ప్రజావాగ్గేయకారులు గోరేటి వెంకన్న హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా బాహు భాషా కవి సమ్మేళనము, సినిమా పాటలు సంగీత విభావరి దాశరథి గేయాలు, ఉంటాయని ఆయన తెలిపారు. కావున కవులు, కళాకారులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. కవులు, కళాకారులకు గౌరవంగా సన్మానం ఉంటుందని ఆయన తెలిపారు. జయంతి సభ అనంతరం మధ్యాహ్నం అందరికీ భోజన వసతి కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో కవి దారం గంగాధర్, దాసు, సుధాకర్, చక్రపాణి, సాయిబాబా, శ్రీనివాస ఆర్య, చంద్రశేఖర్, రాధా కిషన్, గౌతమ్, సుజాత, కటారి రాములు తదితరులు పాల్గొన్నారు.