21న జిల్లా వ్యాప్తంగా ప్రధాన మసీదులు, చర్చీలు, గురుద్వారాలలో ప్రత్యేక ప్రార్ధనలు

– జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ కార్యాలయం నిజామాబాద్
నవతెలంగాణ – కంటేశ్వర్
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 21 న జిల్లా వ్యాప్తంగా ప్రధాన మసీదులు, చర్చీలు, గురుద్వారాలలో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తూ ఆధ్యాత్మిక దినోత్సవము నిర్వహించడం జరుగుతుంది అని నిజామాబాద్ జిల్లా మైనారిటీస్ సంక్షేమశాఖ అధికారి మంగళవారం డి.రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన మసీదులు చర్చలు గురుద్వారాలు తప్పకుండా సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.