సీనియర్ జర్నలిస్ట్, కథా రచయిత, వ్యాసకర్త వుప్పల నరసింహంను యాది చేసుకుంటూ ఈ నెల 21న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియం 1వ అంతస్తులో హైదరాబాద్ మిత్రులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. వుప్పల బాలరాజు సభాధ్యక్షులుగా, జయధీర్ తిరుమల రావు, బి.ఎస్.రాములు వక్తలుగా, ఆడెపు లక్ష్మీపతి, కవి యాకూబ్, సంగిశెట్టి శ్రీనివాస్, ఎస్.యం.ప్రాణ్ రావు, తుమ్మలపల్లి రఘురాములు, శంకర నారాయణ, అనిల్ అట్లూరి, వనపట్ల సుబ్బయ్య, కెపి.అశోక్ కుమార్, జంపాల ప్రవీణ్ తదితరులు ప్రసంగించనున్నారు.