22న మహాధర్నాను జయప్రదం చేయండి

– కల్లుగీత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి మడ్డిఅంజిబాబు
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్‌
గీతా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 22 తేదీన ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు దగ్గర జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని గీత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు కోరారు.మంగళవారం మండలంలోని దాచారం, తుమ్మలపన్‌ పహాడ్‌, కోటపాడు, కొత్తగూడెం, మిడతనపల్లి, ఏపూరు, రామన్నగూడెం, పాతర్లపాడు ఎక్స్‌రోడ్డు గ్రామంలో పర్యటించారు.మహాధర్నా జయప్రదం కోసం పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు.తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోవడం కాల్లు చేతులు విరగడం, నడుము పడిపోవడం జరుగుతున్నాయని పేర్కొన్నారు. గీత కార్మికులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బైక్‌లు ఇవ్వాలని కోరారు.వత్తిదారులకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం సీనియర్‌ నాయకులు అబ్బగానిభిక్షం,ఉయ్యాల నాగేష్‌, జెర్రిపోతుల కష్ణ, బట్టిపల్లి నాగమల్లయ్య, తండ రమేష్‌, బోడ సైదులు, ఆత్మకూరు (ఎస్‌) మండల అధ్యక్షు కార్యదర్శులు నోముల వెంకన్న ,బెల్లంకొండ ఇస్తారి, గీత కార్మిక సంఘం నాయకులు బొమ్మగాని వెంకన్న, బూర రామస్వామి, చౌగాని భిక్షం, చౌగానిసైదులు, బొమ్మగాని భద్రయ్య, కాట్ల వెంకన్న,ఎరగాని జగ్గయ్య, బెల్లంకొండ మాణిక్యం, తండ చంద్రయ్య, పులుసు వీరయ్య, పులుసు అంజయ్య, గడ్డం అంజయ్య, ఎరగాని ఉపేందర్‌, అంజయ్య, పులుసునర్సయ్య,ఎరగాని మల్లయ్య, మడ్డి పరమేష్‌, బత్తిని రామయ్య, ఎరగాని లింగయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మండాది రామస్వామి, మద్దెల సైదులు, గురజాల వెంకన్న, జాలమల్లయ్య, కాసాని సత్యం, పులుసు పుల్లయ్య, రాచకొండ ఉప్పలయ్య ,పిట్టల సంతు, పెట్టాల లింగయ్య,వెంకన్న పాల్గొన్నారు.
మోతె: ఈనెల 22న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు.నామవరం, రాఘవపురం, రాఘవపురం ఎక్స్‌ రోడ్డు ,ఇవాళపురం, కరక్కాయలగూడెం, అన్నారుగూడెం, రావిపాడు,బుర్కచర్ల, సిరికొండ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ పోస్టర్లను అంటించారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జెర్రిపోతుల కష్ణ,జిల్లా సహాయ కార్యదర్శి టి.రమేశ్‌, జిల్లాకమిటీ సభ్యులు నోముల వెంకన్న ,మండల ప్రధానకార్యదర్శి బట్టిపల్లి నాగమల్లయ్య, సోమగాని మల్లయ్య, మామిడి వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షులు కొంపెల్లి వెంకన్న, నాయకులు దుశ్చర్ల ప్రకాశం, గుణగంటిభాస్కర్‌,టి.యాదగిరి, రాపర్తి పుల్లయ్య, చిత్తలూరుఅంజయ్య, బత్తినిబుచ్చయ్య, బత్తినిలవకుశ,దుశ్చర్ల వెంకన్న, జలగం తిరుపతయ్య, బూడిదలింగయ్య, బూడిద సాయిలు, మండవ శ్రీను, కోలధనమ్మ, కోలలక్ష్మమ్మ, కోల ఉపేందర్‌, కోల లింగయ్య, దుర్గయ్య, గోపగాని రమేష్‌, కలగాని శ్రీను, మొక్క ఉప్పలయ్య, గోదల నారాయణ పాల్గొన్నారు.