23న భువనగిరి వక్ఫ్  భూముల  సమస్యలపై ఆవాజ్ ఆధ్వర్యంలో చర్చా గోష్టి 

– ఎంఏ ఇక్బాల్ఆవాజ్ జిల్లా అధ్యక్షులు, షేక్ లతీఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు
నవతెలంగాణ  – భువనగిరి
జిల్లాలోని వక్స్ బోర్డు భూములను పరిరక్షణ కోసం ఈనెల 23న భువనగిరి పట్టణం దుంపల మల్లారెడ్డి ట్రస్టు భవనంలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆవాస్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్ గౌరవాధ్యక్షులు షేక్  లతీఫ్ లు తెలిపారు.  శనివారం భువనగిరి లో రౌండ్ టేబుల్ సమావేశం కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవాజ్  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్  భూములను
పరిరక్షించాలన్నారు.   జిల్లా వ్యాప్తంగా అన్యాక్రాంతమవుతున్న  భూముల రక్షణ కోసం రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా చర్చ గోష్టి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గల వక్ఫ్  భూములపై పర్యవేక్షణ లేకపోవడం వలన భూములు అన్యాకాంతమవుతున్నాయన్నారు. ఎంతో విలువైన ఈ భూములను కాపాడడంలో జిల్లా  ధికారులు వైఫల్యం  చెందుతున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా ఈ భూముల ఆక్రమణలను నియంత్రించి వక్ఫ్  భూమిని కాపాడాలని కోరారు. జిల్లాలో ఉన్న అన్ని వక్స్ భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలన్నారు. ముస్లింలలో ఉన్న పేదల అభ్యున్నతి కోసం వారి  సామాజిక అవసరాల కోసం ఈ భూములు ఉపయోగించాలన్నారు. ఈ భూముల పరిరక్షణ కోసం నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం భూముల పరిరక్షణ కోసం విధి విధానాలను రూపొందించి జిల్లా స్థాయిలో రాజకీయ పక్షాలు మైనార్టీల పెద్దలతో జిల్లా స్థాయి యంత్రాంగం చర్చ గోష్టి  ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సయ్యద్ ముక్తార్ హుస్సేన్ మహమ్మద్ ఆఫర్ ఎండి జలాల్ యూసుఫ్ ఆసిఫ్ పాల్గొన్నారు.