26న ప్రతి గ్రామంలో హరిత హారం లో 1000 మొక్కలు నటించాలి.. 

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఈ నెల 26 న ప్రతి గ్రామంలో హరిత హారం కార్యక్రమం ద్వారా 1000 మొక్కలు తప్పకుండ పాటించాలని  పంచాయతీ కార్యదర్శులను డిఅర్ డీఓ డిఅర్ డిఎ పిడి చందర్ నాయక్ ఆదేశించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులతో సమిక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి, మండల ప్రత్యేక అధికారి చందర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉస్తావాల ముగింపు కార్యక్రమంలో బాగంగా ఈ నెల 26న ప్రతి గ్రామంలో హరిత హారం కార్యక్రమం ద్వారా 1000 మొక్కలు తప్పకుండ నాటలకి కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో  మండల పరిషత్ అభివృద్ది అధికారి అయిన టీవియస్ గోపి బాబు, యంపిఓ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.