28న మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభ 

On 28 Madigala Dharma Yuddha Joint District Mahasabha– ఎంఎస్పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఈ నెల 28న మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభ కామారెడ్డి లో నిర్వహిస్తున్నట్లు ఎంఎస్పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు  మందకృష్ణ మాదిగ  హాజరవుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అలుపెరుగని పోరాటం జరుగుతుంది. ఎస్సీ లో ఉన్నటువంటి 59 కులాలకు విద్యా ,ఉద్యోగ, సాంఘిక సంక్షేమ రంగాలలో వర్గీకరణ లేకపోవడం వల్ల 75 ఏళ్లుగా తీవ్ర అన్యాయం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో మాదిగ మాదికు ఉప కులాలు ప్రజలు సుదీర్ఘ ఆకాంక్ష నెరవేరిందని భావించారు.  ఎస్సీ లో ఉన్నటువంటి అన్ని కులాలకు సామాజిక సమానత్వం రావాలంటే ఎస్సీ వర్గీకరణ అవసరమని భావించి ఆగస్టు1న ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలకు చేసుకోవచ్చంటూ రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వివరించిన తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లో అన్ని రాష్ట్రాల కన్నా ముందే వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ లో అన్నిటిలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు, కానీ రెండు నెలలు కావస్తున్నా కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ లో అలాగే  ఉన్నత విద్య నోటిఫికేషన్ లలో ఈ వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల మాదిగ మాదిగ ఉపకులాలకు తీవ్రంగా నష్టం జరిగింది.
ఈ తరుణంలో 30 వేల ఆకాంక్ష నెరవేరిందని అనుకున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పినందున తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అన్ని అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్వహించడం జరిగింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 25 నుండి 30 వరకు మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభలు, నవంబర్ 4 నుండి 14 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గ కేంద్రాలలో మరియు అన్ని మండల కేంద్రాలలో మాదిగల ధర్మ యుద్ధ దిక్షలు, నవంబర్ 16న దండోరా ధర్మ యుద్ధ రథయాత్ర కోదాడ నుండి మొదలవుతుంది అలాగే డిసెంబర్ 21న  చలో హైదరాబాద్ మాదిగల ధర్మ యుద్ధ మహా ప్రదర్శన నిర్వహించబోతున్నాము అని తెలియజేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వైఖరి నివసిస్తూ ఈ నెల 28న ఉమ్మడి జిల్లా మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమానికి  మందకృష్ణ మాదిగ వస్తున్నట్లు తెలిపారు.ఇట్టి మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని రెండు జిల్లాల మాదిగలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపధ్యక్షలు రోడ ప్రవీణ్, ఎంఎస్పి జిల్లా నాయకులు యాదశ్రీ రాములు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షలు ఆకారం రమేష్, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు పెద్దగారి మహేష్, సొంపూర్ పొచ్చిరాం మాదిగ , మహిళా నాయకులు యమున,  పద్మ, సత్యక, మాదారపు రాములు, ఎం ఎస్ ఎఫ్  నాయకులు హరిదాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.