2న సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం : మాజీ ఎంపీ వి. హనుమంతరావు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్‌ 2 నుంచి 20 రోజులపాటు పలు కార్యక్రమాలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. జిల్లా, మండల కేంద్రాల్లో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం గాంధీభవన్‌లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తూ…చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఇరవై రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి, రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాలని విజ్ఞప్తి చేశారు.