– కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నా 50 ఏండ్ల రాజకీయ అనుభవాన్ని కూర్చి ‘హనుమంతుడు అందరివాడే’ పేరుతో నా జీవిత చరిత్ర పుస్తకాన్ని రాస్తున్నట్టు మాజీ ఎంపీ వి హనుమంతరావు వెల్లడించారు. విద్యార్ధి, యూత్ కాంగ్రెస్, పీసీసీ అధ్యక్షులుగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా నా అనుభావాలను పొందుపరిచినట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వచ్చే తరం వారికి తెలియాలంటూ బుక్ రాస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్, కర్నాటక మంత్రి బొసురాజు, దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు.