8న జాతీయా లోక్ అదాలత్: న్యాయమూర్తి నాగరాజు

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ఈ నెల 8 న నల్లగొండ జిల్లా వ్యాప్తంగ అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ లు నిర్వహింస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, ప్రధాన జిల్లా న్యాయమూర్తి  యం. నాగరాజు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ లోక్ అదాలత్ లలో సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూవివాదాలు, వినియోగదారుల కేసులు, సైబర్ క్రైమ్ కేసులు,  ఇతర సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చని, ఇట్టి అవకాశాన్ని కక్షిదారులందరూ వినివినియోగించుకొని సమన్యాయం, సత్వర న్యాయం పొంది తమ సమయాన్ని ఆదా చేసుకోవలసిందిగా సూచించారు. ఇప్పటికే దాదాపు 13722 కేసులను రాజీపడదగినవిగా గుర్తించబడినట్లు, ఈ జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, ఇన్సూరెన్స్ అధికారులు, రెవిన్యూ అధికారులు, పోలీసు అధికారులు, బ్యాంకు అధికారులు తమవంతు సహకారాన్ని అందిస్తారని,  దీనివలన ఇరుపక్షాలు సామరస్య వాతావరణములో అప్పీలుకు తావు లేని తీర్పు, కోర్టు ఫీజు వాపసు కూడా పొందుతారని తెలిపారు.