నవతెలంగాణ – ఉప్పునుంతల
మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహ స్వామి పాలకమండలి ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పాలకమండలి చైర్మన్,పాలక మండల సభ్యుల ప్రమాణ స్వీకారం ఈనెల 9 న ఉదయం 11:00లకు ఉంటుందని తెలిపారు. నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అతి ప్రాచీన పురాతనమైన దేవాలయాల్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీ మంత్రుల సహకారంతో దేవాలయం అభివృద్ధి చేయడానికి తమ వంతుగా కృషి చేస్తానన్నారు.రానున్న రోజుల్లో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అన్ని రకాల వసతులు సదుపాయాలతో కూడిన దేవాలయంగా తీర్చిదిద్దాము… దేవాలయం కింద పరిధిలో ఉన్నటువంటి భూములను గత ప్రభుత్వ పాలకులు అక్రమంగా పట్టాలు చేశారాని వాటిని స్వాధీనం చేసుకొని దేవాలయ భూములను పకడ్బందీగా రక్షిస్తామని తెలిపారు. యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రజలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.