ఆగష్టు 12న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి..

– టీఎస్ సిపిఎస్ఈయూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎన్ నరేందర్ రావు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ఆగస్టు 12న నిర్వహించనున్న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని టిఎస్ సిపిఎస్ఈయూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. బుధవారం అ బిట్స్ లోని బీమా భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..”అభి నహీ తో కబీ నహీ”  నినాదంతో “పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్ర”   టీఎస్ సిపిఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్టిత ప్రజ్ఞ నాయకత్వంలో జులై 16 వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభమై 33 జిల్లాల గుండా 16రోజుల పాటు కొనసాగుతూ 30 వ తేది న రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కి చేరుకుంటుంది అన్నారు. 31 వ తేదీ యాదగిరిగుట్ట లో ముగుస్తుంది తెలిపారు. ఆగష్టు 12న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నామన్నారు.  ఈ యాత్రకి అన్ని సంఘాల నాయకత్వం మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఉద్యోగులను పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులుగా మార్చి ఉద్యోగుల  భవిష్యత్తును, పెట్టుబడి దారి తళారి చేతిలో పెట్టిన ఈ దళారీ పెన్షన్ విధానం (కాంట్రిబ్యూటరీ పెన్షన్  విధానం) ను అంతమొందించాలని  పంతంతో చేపట్టినది ఈ పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర అన్నారు. ఉద్యోగుల మెడకు ఉరితాడు లాంటి సిపిఎస్  విధానం రద్దు చేయాలని కోరుతూ గత పది రోజులుగా యాత్ర విజయవంతంగా కొనసాగుతూ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చేరుకుంది అన్నారు. ఈ నెల 30 వ తేదీన రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి చేరుకుంటుంది అని తెలిపారు.  ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై సిపిఎస్ ఉద్యోగుల శక్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్ సిపిఎస్ ఈయూ రాష్ట్ర ఈసీ సభ్యులు బి శ్రవణ్ కుమార్,  హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ సత్యనారాయణ, కోశాధికారి కే శ్యాంసుందర్.కే. గంగాధర్ అర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.