జనవరి 12న ఎస్‌జీఎం

– బీసీసీఐ అత్యవసర భేటీలో నిర్ణయం
ముంబయి : భారత క్రికెట్‌ నియం త్రణ మండలి (బీసీసీఐ) జనవరి 12న ప్రత్యేక సర్వ సభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించనుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టగా.. కోశాధి కారి ఆశీష్‌ శెలార్‌లు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో చేరారు. బీసీసీఐ లో రెండు కీలక పదవులు ఖాళీ అయ్యాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం 45 రోజుల్లోగా ఆఫీస్‌ బేరర్ల స్థానాలను భర్తీ చేయాలి. దీంతో గురువారం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాల యంలో సమావేశమైన అపెక్స్‌ కౌన్సిల్‌ మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఏ.కే జ్యోతిని ఎల క్టోరల్‌ ఆఫీసర్‌గా నియమిం చింది. ప్రత్యేక సర్వ సభ్య సమావేశం ఏర్పాటుకు కనీసం 21 రోజుల ముందుగా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బీసీసీఐ నుంచి ఎటువంటి సమా చారం రాలేదని తెలిసింది. బోర్డు తాత్కాలిక కార్యదర్శి దేవాజిత్‌ సైకియ త్వరలోనే ఎస్‌జీఎం నోటీసు ఇవ్వనున్నారు.