11న రుంజ విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనం

ఈ నెల 11న రుంజ విశ్వకర్మల కవులు, రచయితలు, జర్నలిస్టుల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నల్లూరి రాంప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరబ్రహ్మేంద్రస్వామి తాత్విక భూమికతో పాటు సాహిత్య పరిచయాలు, మాటా, ముచ్చట, బంధుమిత్రుల పాత కొత్త తరాల ఆలోచనలు, పుస్తక పరిచయం, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై ప్రణాళిక రూపొందించనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. వివరాలకు 9550630949 నెంబర్‌ నందు సంప్రదించవచ్చు.