నవతెలంగాణ-కోదాడరూరల్
ఈనెల 28 నుండి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మిట్టగనుపుల ముత్యాలు మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపునిచ్చారు.మంగళవారం పట్టణంలో మధ్యాహ్న భోజన కార్మికుల నిరవధిక సమ్మె నోటీసు ఎంఈఓ షేక్ సలీం షరీఫ్‌కు అందజేసి మాట్లాడారు.డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబర్ 28 నుండి మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాలల్లో భోజనం వండకుండా నిరవధిక సమ్మెను చేస్తున్నారని,సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు గురజాల తిరుపతమ్మ, నాగలక్ష్మి, సుజాత,కుసుమ, అనంత, సావిత్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్:మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 28 నుండి జరుగు సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కష్ణ కోరారు.మంగళవారం మండలంలోని లింగాల, దుపహడ్, ముకుందాపురం, చీదేళ్ల, మల్కాపురం, భక్తాలపురం, ధర్మాపురం గ్రామాల్లో మధ్యాహ్న భోజన కార్మికులను మంగళవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటమ్మ, ధనలక్ష్మీ, రంగమ్మ సునీత, మన్నెమ్మ, పద్మ, మానస, గోవిందమ్మ పాల్గొన్నారు.
నేరేడుచర్ల :అసెంబ్లీ సాక్షిగా మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన జీతాలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ నీలా రామ్మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ి శంకరయ్యకు మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి సమ్మె నోటీస్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మండల నాయకురాలు మొగిలిచర్ల రుద్రమ్మ,సీఐటీయూ నాయకులు కుంకు తిరుపతయ్య, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.