నవతెలంగాణ- ఆర్మూర్
జనవరి 9న రైతు.కూలి అశేషప్రజానిక సమస్యల పరిష్కారానికి డిమాండ్ రోజును జయప్రదం చేయాలని, జిల్లా వ్యవసాయ మార్కెట్ ఖరీదార్లు కమిషన్ దారులుసిండికేట్ అవతారమెత్తి, పసుపు రైతులను నిండా ముంచుతున్న తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ V. ప్రభాకర్..B. దేవారం. అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా.. అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రాష్ట్ర కార్యదర్శి దేవరాములు మాట్లాడుతూ.. పసుపు బోర్డు సాధన ఉద్యమం నాలుగు దశాబ్దాల కాలం కొనసాగుతా ఉంది. ఒకరిని ఓడించి ఒకరు గెలిపించిన చరిత్ర పసుపు రైతులకు ఉంది. అఖిలభారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ మార్కెట్ పసుపు కొనుగోలుదారులు కమిషన్ దారులు ప్రతి సంవత్సరం సిండికేట్ అవతారం ఎత్తి కృత్రిమంగా ధరలు తగ్గించి రైతులని నిండా ముంచుతున్నారని పదేపదే చెబుతున్న ఆందోళనలు చేస్తున్న అధికారులు గానీ అధికార పార్టీ గానీ స్పందించిన పాపను పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరి ఈ వ్యాపారులు బరితెగించి డిసెంబర్ 19వ తేదీన దా నిజామాబాద్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్ ఇనాని అధ్యక్షతన సమావేశం చేసుకొని రైతుకు ఒకసారి వేలం వేస్తే ధర తగ్గిందని మరోసారి వేలం వేయారాదని కోరడానికి వీలు లేకుండా.. ఎవరైనా కమిషన్ దారు రైతుకు ఎక్కువ ధర ఇప్పిస్తే 1100 సమాచారం చెప్పిన వ్యక్తికి బహుమానం ప్రకటించారు.
కమిషన్ దారుకు 5100జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం , తీర్మానంభూస్వామ్య రాచరిక పద్ధతిగా ఉందని ఈ మర్చంట్ అసోసియేషన్ పై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విరుసిండికేట్ అవతారం పై ఉక్కు పిడికిలి బిగించాలని పోలీస్ యంత్రాంగాన్ని గౌరవనీయ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.. అధికార పార్టీ నాయకుల్లారా గంజి సెట్ల మెప్పు కోసం చూడకుండా రైతుల బాగు కొరకు ఈ తీర్మానంపై గట్టి చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అఖిలభారత ఐక్య రైతు సంఘం దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి. భూమిలేని పేదలకు భూములు ఇవ్వాలని. ఉపాధి హామీ పనులు 200 రోజులు పని కల్పించాలని రోజు కూలి 600 రూపాయలు నిర్ణయించాలని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాని ఒకేసారి 15వేల రూపాయలు రైతు ఖాతాలో వేయాలని. మిగిలిన 50 శాతం రైతులకురెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, అడివి హక్కుల చట్టం పరిధిలో పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని.. ఎం ఎస్ పి కి చట్టబద్ధత కల్పించాలని. డిమాండ్ రోజుగా జనవరి 9న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలని కోరారు. నిజాంబాద్ లో జరిగే ఆందోళనలో రైతుల పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సారా సురేష్ మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దున మోడీ రాతపూర్వక హామీలు అమలుకై నవంబర్ 26వ తేదీ నుండి ప్రముఖ రైతు నాయకుడు. జగ్జీత్ సింగ్ దలేవాల అమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆరోగ్యం క్షమిస్తుందని అందుగ్గాను రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారికి ప్రాణ అపాయం జరిగితే మోడీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు బి కిషన్. ఆకుల గంగారం. ఇస్తరి రమేష్. T. గంగాధర్.A. సాయిలు. B. గంగాధర్. శేఖర్. తదితరులు పాల్గొన్నారు.