9న ‘వెలుగు సంతకం’ ఆవిష్కరణ

కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవితా సంపుటి ‘వెలుగు సంతకం’ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఎస్‌ఎన్‌ఆర్‌ పబ్లికేషన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న శనివారం సాయంత్రం 5 గంటలకు వనపర్తిలోని కేడీఆర్‌ నగర్‌, ఎంవైఎస్‌ బాంకెట్‌ హాల్‌లో నిర్వహించనున్నారు. విశ్రాంత ఉపన్యాసకులు డా. వీరయ్య అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెటింగ్‌ సహకార శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరు కానున్నారు.