‘అస్తిత్వపు అంచుల్లో’..

తప్పొప్పుల తడబడు నడకల తాత్పర్యం జీవితం
కోరిరాని చెప్పిపోని నడుమ నాల్గురోజుల జీవితం
రాజ్యమేలినా రాళ్లే మోసినా మట్టికంకితం జీవితం

ఇంకెందుకో ఇంకొకరిపై ఈ కక్షలూ ఆవేశకావేషాలు
ఇంకెందుకో ఇంకొకరిపై ఆధిపత్యం అఘాయిత్యం
ఇంకెందుకో ఇంకొకరిపై రణాలు మారణహోమాలు

నీకు వేసిన పూలదండ వాడిపోక తప్పదు తప్పదు
నీనేటి అధికారం రేపు తొలగిపోక తప్పదు తప్పదు
నీవు బ్రతికిన గుర్తు మసిబారక తప్పదు తప్పదు

నీవు నిలిపిన ప్రాణం నిన్ను మరిచిపోక ఉంటుంది
నీవు నాటిన తోట పండు నీడా ఇస్తూనే ఉంటుంది
నీవేసిన బాట నలుగురికీ రాజమార్గ మవుతుంది

మనం ఉంటేనే దేవుడు మనంలేక తలచే దెవరు
మానవత లేని చోట దేవుడూ ఉండడు ఉండడు
నీతి న్యాయం ధర్మం లేకుంటే జీవం దైవం ఎందుకు

– నండూరి రామచంద్ర రావు

9949188444