మంత్రి శ్రీధర్ బాబు చొరవతో కాంట్రాక్టు కార్మికులకు రూ.5 వేలు బోనస్ 

On the initiative of Minister Sridhar Babu, bonus of Rs. 5 thousand for contract workersనవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలం పన్నూర్ పన్నూర్ ఎక్స్ రోడ్లో ఏర్పడేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట చంద్రయ్య మాట్లాడారు.. సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశంలో కనీ విని ఎరుగని చరిత్రలో మంత్రి దుద్దిల్ల  శ్రీధర్ బాబు ఆశీస్సులతో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 20,వేల పైచిలుకు కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేల బోనస్ ప్రకటించడం పట్ల కార్మికులు పూర్తిస్థాయిలో వారి కుటుంబాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే దీనికి కృషి చేసిన మినిమం వేజ్ బోర్డు  అధ్యక్షులు జనక్ ప్రసాద్ కు కార్మికులు వారి కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. అదేవిధంగా  ఇటువంటి బోనస్ ప్రకటించిన పట్ల కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇలాంటివన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడం వలనే కాంట్రాక్టు కార్మికులకు కూడ న్యాయం చేస్తున్నారని,  కార్మికులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి పాలాభిషేకం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  పన్నూర్ తాజా మాజీ ఎంపీటీసీ చిందం మహేష్, మాజీ జడ్పీటీసీ మైదం భారతి వరప్రసాద్, ఆదివారం పేట మాజీ సర్పంచ్ వేప చెట్టు రాజేషం, మాజీ ఎంపిటిసి  కన్నూరి నర్సింగరావు , గ్రామ శాఖ అధ్యక్షుడు మైదం  బుచ్చయ్య, సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి   తదితరులు పాల్గొన్నారు.