ఎల్బీ స్డేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే వేడుక మే 4వ తేదీన దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికి నాలుగుసార్లు డైరెక్టర్స్ డేను సెలబ్రేట్ చేశారు. ఈ ఏడాది ఐదవసారి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే వేడుకలు నిర్వహించబోతున్నారు. డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ, ‘ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజింగ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం మిడ్ డే మీల్స్, అసోసియేషన్‌కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం చేస్తాం. ప్రోగ్రామ్ నిర్వహణకు దర్శకులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందిని రెడ్డి, అనుదీప్ కేవీ, విజరు కనకమేడల తదితరులతో కల్చరర్ కమిటీ ఏర్పాటు చేశాం.