కార్తీక మసం సందర్భంగా.. 

– అరుణాచలం కు ప్రత్యేక బస్సులు..

నవతెలంగాణ – ధూల్ పేట్ 
కార్తీక మసం సందర్భంగా పవిత్ర పుణ్య క్షేత్రం అరుణాచలం కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ప్రారంభం కాబోతున్న కార్తీకమాసంలోని కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 25వ తేదీ నుండి తగిన బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నట్లు తెలిపారు. ఈ బస్సులు 25న బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయన్నారు. ఈ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.3,690లు చార్జీలుగా నిర్ణయించమన్నారు. ఈ అవకాశాన్ని అరుణాచలం వెళ్లే ప్రయాణికులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.