ఆరో రోజు 20మంది నామినేషన్లు, 23 సెట్ల పత్రాలు దాఖలు

నవతెలంగాణ – భువనగిరి
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఆరో రోజైన బుధవారం నాడు  14- భువనగిరి పార్లమెంట్ సంబంధించి ఇరవై మంది అభ్యర్డులు 23 సెట్ల నామినేషన్లు  దాఖలు  చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా జంగా సుజాత మూడవ సెట్, సోషల్ జస్టిస్ ఆఫ్ ఇండియా పార్టీ అభ్యర్థిగా తరిగోపుల మహేందర్ ఒక సెట్, నేషనల్ మహాసభ పార్టీ అభ్యర్థిగా కొత్తోజు శ్రీనివాస్. ఒక సెట్ నామినేషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థిగా బొల్లారం బాలరాజు రెండవ సెట్ నామినేషన్,  తెలంగాణ రాష్ట్ర పునరనిర్మాణ పార్టీ అభ్యర్థిగా పూస శ్రీనివాస్ ఒక సెట్ నామినేషన్, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామిని భాస్కర్ ఒక సెట్.,సిపిఎం పార్టీ అభ్యర్థిగా అనురాధ రెండవ సెట్ నామినేషన్, స్వతంత్ర అభ్యర్థిగా ఈదుల వీర పాపయ్య మూడవ సెట్, స్వతంత్ర అభ్యర్థిగా నక్కల సురేందర్ రెండవ సెట్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అభ్యర్థిగా ముసునూరి గణేష్ ఒక సెట్.,భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ నాలుగవ సెట్, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మణిపాల్ రెడ్డి రెండవ సెట్.,నేషనల్ నవ  క్రాంతి పార్టీ అభ్యర్థిగా పులిగిల్ల బిక్షపతి ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థిగా ఏమి రెడ్డి రవి కిరణ్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్, స్వదేశీ కాంగ్రెస్ జాతీయ పార్టీ అభ్యర్థిగా పల్లెల మైసయ్య ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థిగా కన్నె రామరాజు రెండు సెట్ల నామినేషన్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కొంగరి లింగస్వామి మూడవ సెట్.,స్వతంత్ర అభ్యర్థిగా పోతుల యాదగిరి రెండు సెట్లు.,జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా నల్ల కరుణాకర్ రెడ్డి రెండవ సెట్లను అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జెండగే స్వీకరించారు.