టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో

– వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ హాల్‌టికెట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి ఈనెల 15,16 తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈనెల 15న ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2, 16న ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాతపరీక్షలుంటాయని వివరించారు.