– త్వరలో జీ 7 నేతల సమావేశం
రోమ్ : తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య చెలరేగిన దాడులతో మొత్తంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలపై జీ-7 దేశాల నేతలందరూ చర్చించాలని, ఈ మేరకు ఒక వీడియో సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి వుందని ఇటలీ ప్రధాని జార్జియా మెలొని పేర్కొన్నారు. అయితే సమావేశపు సమయాన్ని ఇంకా నిర్ణయించలేదు. ఎజెండా సమన్వయంపై నేతలు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత సమావేశం ఎప్పుడు జరిగేది నిర్ణయిస్తారు. మధ్యప్రాచ్య సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం వుండాలని ఇటలీ కోరుకుంటోందని మెలొని చెప్పారు. ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య సరిహద్దు వద్ద భద్రతకు హామీ కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి తాత్కాలిక బలగాలు (యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్)ను బలోపేతం చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని భద్రతా మండలికి ఇటలీ ప్రతిపాదించనుందని చెప్పారు.
ఇదిలావుండగా, లెబనాన్‌లో తక్షణమే మిలటరీ ఆపరేషన్‌కు స్వస్తి పలకాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఇజ్రాయిల్‌ను కోరారు. భద్రతా మండలి 1701 తీర్మానానికి అనుగుణంగా లెబనాన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించాలని ఆయన ఆకాంక్షించారు. యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌కు తమ దేశం కట్టుబడి వుందని మాక్రాన్ పునరుద్ఘాటించారు. ఈ దిశగా చర్యలు తీసుకునేవారికి బాసటగా నిలబడుతుందని తెలిపారు. త్వరలోనే లెబనాన్ ప్రజల కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్, లెబనాన్ ప్రజలల భద్రతకు హామీ కల్పిస్తూ దీర్ఘకాలిక పరిష్కారాన్ని అన్వేషించాలని ఈ దిశగా కృషి చేయాలన్నారు.
ఇరాన్‌కు అనవసర ప్రయాణాలొద్దు : కేంద్రం
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. ‘దాడుల ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితులను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణా లకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం ఇరాన్‌లో నివ ూూసిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలి. అవసర మైతే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాల యంతో సంప్రదింపులు జరపాలి’ అని కేంద్రం పేర్కొంది. కాగా ఢిల్లీలోని ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం వద్ద భారీ భద్రతను భారీ స్థాయిలో పెంచారు.