మరోమారు మీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించండి

– గ్రామాలఅభివద్ధి, సంక్షేమమే లక్ష్యం
– బీఆర్‌ఎస్‌ తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి కిశోర్‌కుమార్‌
నవతెలంగాణ-అర్వపల్లి
మరోమారు మీ తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించండిని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ కోరారు.ఆదివారం ఆదివారం మండలంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా బొల్లంపల్లి ,సీతారాంపురం,చాకలిగూడెం, కొత్తగూడెం, రామన్నగూడెం, వేల్పుచర్ల,అడివెంల, ఉయ్యాలవాడ, కుంచమర్తి గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.తెలంగాణలో మరో మారు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి మరోమారు గెలిపించాలని కోరారు.కేసీఆర్‌ పేదల పక్షపతి అని, ప్రభుత్వం అన్ని వర్గాల అభివద్ధికి కషి చేస్తుందన్నారు.మరో మారు అవకాశం ఇచ్చి తనను గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉండే విధంగా మీ నాయకుడిగా సేవ చేసుకుంటానన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా దూరంగా ఉండే నాయకులకు ఓటు వేయొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలలో తుంగతుర్తి నియోజకవర్గ ఆసరా పింఛన్‌49399 మందికి, 2700 మందికి దళితబంధు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, రైతుబీమా, బీసీబంధు అందజే శామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలఅధ్యక్షులు గుండగాని సోమేష్‌గౌడ్‌, ఎంపీపీ మన్న రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్‌, జెడ్పీటీసీ దావుల వీర ప్రసాద్‌యాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌కుంట్ల సురేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా ,నాయకులు మొరిశెట్టి ఉపేందర్‌, సర్పంచులు దానం సుజాత, బైరబోయిన సునీత రామలింగయ్య, కుంభం కరుణాకర్‌,ఉగ్గ ఉపేంద్ర, లింగరాజు, తిరుమల పద్మ వెంకటయ్య, సాగర్ల బుచ్చయ్య, ఎంపీటీసీలు కనుక పద్మ శ్రీనివాస్‌, బొడ్డు రామలింగయ్య, కోఆప్షన్‌ సభ్యులు హమీద్‌ పాల్గొన్నారు.