వాషింగ్టన్: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మరోమారు ఉద్వాసనలు నెలకొనే అవకాశాలున్నాయి. ఈ దఫా కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఉద్యోగులను ఇంటికి పంపించనుందని రిపోర్టులు వస్తోన్నాయి. ఇందుకోసం కార్యాచరణను ప్రారంభించినట్లు సమాచారం. సంస్థను సమర్థవంతంగా మార్చడంతో పాటు ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అమెజాన్ కార్యకలాపాల సమర్థతను పెంచేందుకు ఉద్యోగుల తొలగింపు సహాయపడుతుందని కంపెనీ భావించింది. వేటుకు గురైన ఉద్యోగులకు అవసరమైన సాయం చేస్తామని తెలిపింది. సంస్థ వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా 2022లో ఏకంగా 27వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. తాజా రౌండ్‌లో ఎందరు రోడ్డున పడేది తెలియరాలేదు.