చిరంజీవి నటిస్తున్న ‘విశ్వం భర’ టైటిల్ టీజర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులని అలరించారు. టైటిల్ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనం సష్టిం చింది. ఈ సినిమా కోసం మేకర్స్ 13 పెద్ద పెద్ద సెట్‌లను నిర్మించి, న్యూ వరల్డ్‌ని క్రియేట్ చేశారు. నవంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ మైంది. లేటెస్ట్‌గా శుక్రవారం చిరంజీవి ‘విశ్వంభర’ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. టీమ్ విడుదల చేసిన క్రియేటివ్‌లో చిరంజీవి విశ్వంభర ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు చూపిస్తుంది. ఇది చాలా క్రియేటివ్, మెస్మరైజింగ్‌గా ఉంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కథానాయికగా నటించడానికి త్రిషని మేకర్స్ ఎంపిక చేశారు. సోమవారం షూటింగ్‌లో ఆమె జాయిన్ అయ్యారు. ఆమెకు చిరంజీవి, దర్శకుడు వశిష్ట, నిర్మాతల నుంచి ఘన స్వాగతం లభించింది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్‌కి ఆమె తన చార్మ్, గ్రేస్‌ను జోడించడానికి సిద్ధంగా ఉన్నారు. త్రిష గతంలో చిరంజీవి కల్సి ‘స్టాలిన్’లో పనిచేశారు. ఈ కాంబినేషన్‌లో మ్యాజికల్ కెమిస్ట్రీని మనం ఆశించవచ్చు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ ఫాంటసీ అడ్వెంచర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా. ఈ సినిమా సాంకేతికంగా చాలా గ్రాండీయర్, విజువల్ వండర్‌గా ఉండబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, డీవోపీ : ఛోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి, సాహిత్యం: శ్రీ శివ శక్తి దత్తా, చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్: శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ శబరీష్, లైన్ ప్రొడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి.